Russia: ర‌ష్యాకు మ‌రో షాక్‌.. యూ ట్యూబ్‌, గూగుల్ ప్లే సేవ‌లు బంద్‌

  • ర‌ష్యాలో యూ ట్యూబ్ ప్రీమియ‌మ్ నిలిపివేత‌
  • ఛానెల్ మెంబ‌ర్ షిప్‌, సూప‌ర్ ఛాట్‌, మ‌ర్కెండైజ్ సేవ‌లూ అంద‌వు
  • ఆల్ఫాబెట్ కీల‌క నిర్ణ‌యం
youtube and google play suspends their services in russia

ఉక్రెయిన్‌పై యుద్ధం మొద‌లెట్టిన ర‌ష్యాపై ఆంక్ష‌ల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే అగ్ర‌రాజ్యం అమెరికా స‌హా నాటో, ఈయూ దేశాలు స‌హా ప‌లు వాణిజ్య సంస్థ‌లు కూడా ర‌ష్యాపై ఆంక్ష‌లు విధించాయి. తాజాగా ఈ జాబితాలోకి యూ ట్యూబ్‌, గూగుల్ ప్లేలు కూడా చేరిపోయాయి. ఈ రెండు సంస్థ‌ల‌కు చెందిన అన్నిచెల్లింపుల సేవ‌ల‌ను ర‌ష్యాలో నిలిపివేస్తున్న‌ట్లుగా ఈ సంస్థ‌ల మాతృ సంస్థ ఆల్ఫాబెట్ గురువారం ఓ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

వాస్త‌వానికి ఇదివ‌ర‌కే యూ ట్యూబ్‌తో పాటు గూగుల్ కూడా ర‌ష్యా వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌ను త‌మ వేదిక‌పై నిషేధించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా చెల్లింపుల‌తో కూడిన త‌న సేవ‌ల‌న్నింటినీ కూడా ర‌ష్యాలో నిలిపివేస్తున్న‌ట్లుగా యూ ట్యూబ్‌, గూగుల్ ప్లే తెలిపాయి. ఈ నిర్ణ‌యంతో ర‌ష్యాకు చెందిన వినియోగ‌దారుల‌కు యూ ట్యూబ్ ప్రీమియ‌మ్‌, ఛానెల్ మెంబ‌ర్ షిప్‌, సూప‌ర్ ఛాట్‌, మ‌ర్కెండైజ్ సేవ‌లు అంద‌వు. పాశ్చాత్య దేశాలు ర‌ష్యాకు సంబంధించి బ్యాంకింగ్ సేవ‌ల‌ను నిలిపివేయ‌డంతో త‌మ సేవ‌ల చెల్లింపుల‌కు అంత‌రాయం క‌లుగుతున్నందున‌నే యూ ట్యూబ్‌, గూగుల్ ప్లేలు తాజాగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా స‌మాచారం.

More Telugu News