Mallu Bhatti Vikramarka: అమరీందర్ వల్లే పంజాబ్ లో కాంగ్రెస్ కు ఈ పరిస్థితి వచ్చింది: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka opines on Punjab election results
  • పంజాబ్ లో కాంగ్రెస్ ఘోర పరాజయం
  • అమరీంద్ వైఫల్యం ప్రభావం చూపిందన్న భట్టి
  • తెలంగాణపై ఆ ప్రభావం ఉండదని స్పష్టీకరణ
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు ఎదురుగాలి వీయడం తెలిసిందే. ముఖ్యంగా, అధికారంలో ఉన్న పంజాబ్ లోనూ ఆ పార్టీకి దిగ్భ్రాంతికర ఫలితాలు వచ్చాయి.  దీనిపై తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తన అభిప్రాయాలను పంచుకున్నారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎంగా పనిచేసిన కాలంలో ఆయన వైఫల్యమే కాంగ్రెస్ ను ఈ ఎన్నికల్లో దెబ్బతీసిందని అన్నారు. పంజాబ్ కాంగ్రెస్ నేతల తీరు కూడా అందుకు తగ్గట్టుగానే ఉందని, రోగం ముదిరాక మందు వేసినట్టుందని వ్యాఖ్యానించారు.

అయినా రాజకీయాల్లో గెలుపోటములు సహజమని భట్టి పేర్కొన్నారు. అయితే పంజాబ్ రాజకీయాలకు, తెలంగాణ రాజకీయాలకు తేడా ఉందని, పంజాబ్ ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపబోవని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు తప్ప వివాదాలు లేవని ఉద్ఘాటించారు.
Mallu Bhatti Vikramarka
Punjab
Congress
Election Results

More Telugu News