Congress: మరింత దిగజారిపోయిన కాంగ్రెస్... ఇక రెండు రాష్ట్రాలకే పరిమితం!

  • 2012లో 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం
  • ఇప్పుడు ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో ఒక్క చోట కూడా అధికారంలోకి రాలేని పరిస్థితి
  • కేవలం రాజస్థాన్, చత్తీస్ ఘడ్ కు మాత్రమే పరిమితం
Congress party limited to 2 states only

శతాబ్ద కాలానికి పైగా ఘన చరిత్ర కలిగి, గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పిలవబడే కాంగ్రెస్ రోజురోజుకూ తన ప్రాభవాన్ని కోల్పోతోంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓటమిపాలు కావడం సాధారణ అంశంగా మారింది. ఇటీవల ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు.

 2012లో దేశంలో 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పుడు కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితం కానుంది. కేవలం రాజస్థాన్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉండనుంది. పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

More Telugu News