Punjab: పంజాబ్ ప్రజలకు అరవింద్ కేజ్రీవాల్ మెసేజ్

Arvind Kejriwal Message to Public Of Punjab
  • విప్లవాత్మకమైన తీర్పిది
  • పంజాబ్ ప్రజలకు శుభాకాంక్షలు
  • భగవంత్ మన్ తో కలిసి దిగిన ఫొటో ట్వీట్
పంజాబ్ లో ఏకచ్ఛత్రాధిపత్యంతో సామాన్యుడి పార్టీ (ఆప్) దూసుకెళ్తోంది. చీపురుపట్టి అన్ని పార్టీలను రాష్ట్రంలో ఊడ్చి పారేస్తోంది. కారణమేదైనా కావొచ్చు.. పంజాబ్ లో కాంగ్రెస్ ను ప్రజలు గద్దె దించేస్తున్నారు. సామాన్యుడిని రాజ్య సింహాసనంపై కూర్చోబెడుతున్నారు. పంజాబ్ ను ‘పంజాప్’ అనేలా చేశారు. ఈ నేపథ్యంలోనే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, సీఎం అభ్యర్థి భగవంత్ మన్ ప్రజలకు ప్రకటన చేశారు. 

ఇంతటి విప్లవాత్మకమైన తీర్పునిచ్చిన పంజాబ్ ప్రజలకు శుభాకాంక్షలు అని కేజ్రీవాల్ అన్నారు. భగవంత్ మన్ తో కలిసి దిగిన ఫొటోను ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. విజయపు నినాదంతో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను ఆయన ప్రజలతో పంచుకున్నారు. ప్రస్తుతం పంజాబ్ లో ఆప్ 90 సీట్లలో ముందంజలో ఉంది. బీజేపీ 2 సీట్లలోనే విజయం సాధించింది. శిరోమణీ అకాలీదళ్ ఆరు స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ కేవలం 18 స్థానాల్లో ముందంజలో ఉంది.
Punjab
AAP
Arvind Kejriwal
Bhagawant Mann

More Telugu News