Chandrakant Patil: మహిళల ఓటు బీజేపీకి.. పురుషుల ఓటు ఎస్పీకి: బీజేపీ నేత చంద్రకాంత్ పాటిల్

Women must have voted for BJP men for SP says Chandrakant Patil
  • యూపీ ఎన్నికలపై బీజేపీ మహారాష్ట్ర చీఫ్ పాటిల్ వ్యాఖ్య
  • నాలుగు రాష్ట్రాల్లో బీజేపీదే అధికారం
  • బీజేపీని ఓడించడం అంటే తలను గోడకేసి బాదుకోవడమేనని వ్యాఖ్య
యూపీలో ఎన్నికలకు సంబంధించి బీజేపీ నేత, బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ వినూత్నంగా స్పందించారు. ఉత్తరప్రదేశ్ లో మహిళలు అందరూ బీజేపీకే ఓటు వేశారన్న ఆయన.. ఎస్పీకి పురుషులు ఓటు వేసి ఉండొచ్చన్నారు. 

ఓట్ల కౌంటింగ్ సరళిని చూస్తే నాలుగు రాష్ట్రాల్లో బీజేపీయే అధికారం సొంతం చేసుకుంటుందని తెలుస్తోందని చెప్పారు. బీజేపీని ఓడించడం అంటే తలను గోడకేసి బాదుకోవడమని ఆయన మరో వ్యాఖ్య చేశారు. 

Chandrakant Patil
bjp
Maharashtra

More Telugu News