Shane Warne: వార్న్ చనిపోవడానికి ముందు ఆయన గదిలోకి వెళ్లిన మసాజ్ చేసే అమ్మాయిలు!

4 massage girls went to Shane Warne room before his death
  • నాలుగు గంటల ముందు విల్లాకు వెళ్లిన నలుగురు అమ్మాయిలు
  • వార్న్ తో గంటకు పైగా గడిపిన ఇద్దరు అమ్మాయిలు
  • సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు
స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ ఈ నెల 4న హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. థాయ్ లాండ్ లోని తన విల్లాలో ఆయన మృతి చెందారు. ఆయనది సహజ మరణమేనని, గుండెపోటుతో ఆయన మరణించారని అటాప్సీ రిపోర్టు వెల్లడించింది. అయితే, తాజాగా వెలుగు చూసిన ఓ వీడియో పలు అనుమానాలకు తెరతీస్తోంది. 

వార్న్ చనిపోవడానికి నాలుగు గంటలకు ముందు మసాజ్ చేసే నలుగురు అమ్మాయిలు ఆయన విల్లాలోకి వెళ్లారు. యువతులు లోపలకు వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వార్న్ బతికుండగా ఆయనను చివరిసారిగా చూసింది ఈ నలుగులు అమ్మాయిలేనని పోలీసులు సైతం నిర్ధారించారు. 

పోలీసులు చెపుతున్న వివరాల ప్రకారం వార్న్ చనిపోయన రోజున మధ్యాహ్నం 1.53 గంటలకు మసాజ్ చేసే నలుగురు అమ్మాయిలను పిలిపించుకున్నారు. వీరిలో ఇద్దరు వార్న్ ఉన్న గదిలోకి వెళ్లగా... మిగిలిన ఇద్దరూ వార్న్ స్నేహితుల గదుల్లోకి వెళ్లారు. వార్న్ తో ఇద్దరు అమ్మాయిలు దాదాపు గంటకు పైగా గడిపి 2.58 గంటల సమయంలో బయటకు వెళ్లిపోయారు.  

మరోవైపు మధ్యాహ్నం భోజనానికి వస్తానన్న వార్న్ ఎంత సేపటికీ రాకపోవడంతో.. సాయంత్రం 5.15 గంటలకు వార్న్ గదికి ఆయన స్నేహితులు వెళ్లారు. అప్పటికే వార్న్ బెడ్ పై విగతజీవిగా పడి ఉన్నారు. అయితే స్నేహితులు సీపీఆర్ చేస్తుండగా రక్తం కక్కుకున్నారని పోలీసులు తెలిపారు. వార్న్ అంతకు ముందు నుంచే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు. గుండెపోటు కారణంగానే ఆయన మృతి చెందారని తెలిపారు. మరోవైపు మసాజ్ చేసేందుకు వచ్చిన నలుగురు అమ్మాయిలను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.
Shane Warne
Massage Girls
Death
Australia

More Telugu News