BJP: యూపీలో దూసుకెళ్తున్న బీజేపీ.. పలు రాష్ట్రాల్లో పోటీ ఇస్తున్న కాంగ్రెస్

  • పంజాబ్‌లో కాంగ్రెస్-ఆప్ మధ్య హోరాహోరీ
  • మణిపూర్‌లో ఆధిక్యంలో కాంగ్రెస్
  • గోవాలో బీజేపీ-కాంగ్రెస్ పోటాపోటీ
  • ఉత్తరాఖండ్‌లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ
Congress strongly replies to BJP in many states

ఐదు రాష్ట్రాలకు ఇటీవల పలు విడతలుగా జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 90 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, సమాజ్‌వాదీ పార్టీ 59 స్థానాల్లో బీఎస్పీ 7, కాంగ్రెస్ 3, ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 

పంజాబ్‌లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పోటీ హోరాహోరీగా ఉన్నట్టు సరళిని బట్టి తెలుస్తోంది. కాంగ్రెస్ 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ‘ఆప్’ 11, ఎస్ఏడీ, దాని మిత్ర పక్షాలు కలిసి 11 స్థానాల్లో, బీజేపీ, దాని మిత్రపక్షాలు రెండు స్థానాల్లో, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఉత్తరాఖండ్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వా? నేనా? అన్నట్టుగా పోరు సాగుతోంది. బీజేపీ 18, కాంగ్రెస్ 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. గోవాలోనూ బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బీజేపీ 15, కాంగ్రెస్ 16, తృణమూల్ కాంగ్రెస్ 2, ఆప్ 3, ఇతరులు నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా మణిపూర్‌లో కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఆ పార్టీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 3, ఎన్సీపీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.

  • Loading...

More Telugu News