Russia: ఈ దేశాలన్నింటికీ మేమేంటో చూపిస్తాం: రష్యా

Will show our power warns Russia
  • యుద్ధం నేపథ్యంలో రష్యాపై పలుదేశాల ఆంక్షలు
  • ఆయా దేశాలకు నొప్పి తెలిసేలా చేస్తామన్న రష్యా
  • తాము కూడా ఆంక్షలు విధిస్తామని హెచ్చరిక
ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాపై అమెరికాతో పాటు పలు యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా తీవ్రంగా స్పందించింది. తమపై ఆంక్షలు విధించిన దేశాలకు నొప్పి తెలిసే విధంగా చేస్తామని, తాము కూడా ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. యుద్ధం ప్రారంభించిన 10 రోజుల్లోనే రష్యాపై 2,700కు పైగా ఆంక్షలను విధించాయి. 

ప్రస్తుతం రష్యా ఐదున్నర వేలకు పైగా ఆంక్షలను ఎదుర్కొంటోంది. ఉత్తర కొరియా, ఇరాన్ ల కంటే ఇది ఎక్కువ. రష్యా చాలా వేగంగా, కచ్చితంగా స్పందిస్తుందని ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి అన్నారు. ఏయే దేశాలపై ఏ ఆంక్షలు విధించాలనే కోణంలో సమాలోచనలు జరుగుతున్నాయని చెప్పారు.
Russia
Ukraine
war
Sanctions

More Telugu News