Ravindra Jadeja: ఐసీసీ టాప్‌ ర్యాంకులో జ‌డేజా

ravindra jadeja rops icc test all rounder
  • టెస్టుల్లో ఆల్ రౌండ‌ర్‌గా టాప్‌లో జ‌డేజా
  • బ్యాటింగ్ లో కోహ్లీకి 5, రోహిత్‌కు 6 వ ర్యాంకులు 
  • బౌలింగ్‌లో రెండో స్థానంలో అశ్విన్‌
టీమిండియా ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జడేజా ఐసీపీ ర్యాంకింగ్స్‌లో అద‌ర‌గొట్టాడు. శ్రీలంకతో జ‌రిగిన తొలి టెస్టులో డ‌బుల్ సెంచరీ (175 నాటౌట్‌)కి ద‌గ్గ‌ర‌వ‌డ‌మే కాకుండా ఓ ఇన్నింగ్స్‌లో ఏకంగా 5 వికెట్లతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి మొత్తంగా రెండు ఇన్నింగ్స్‌లలో 9 వికెట్లు తీసి స‌త్తా చాటిన జడేజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచాడు. టెస్టుల్లో ఆల్ రౌండ‌ర్ల‌లో టాప్ ర్యాంకులో జ‌డేజా నిలిచాడు. ఈ మేర‌కు కాసేప‌టి క్రితం ఐసీసీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. 2017లో కూడా ఓ సారి టెస్ట్ ఆల్ రౌండ‌ర్ల ర్యాంకుల్లో జ‌డేజా టాప్ ర్యాంకు సాధించిన విష‌యం తెలిసిందే. 

బ్యాటింగ్‌లో త‌న‌దైన శైలి స‌త్తా చాటిన జ‌డేజా 54వ ర్యాంకు నుంచి ఏకంగా 17 స్థానాలు ఎగ‌బాకి 37వ ర్యాంకులోకి చేరాడు. బౌలింగ్ లో 17వ ర్యాంకుకు ఎగ‌బాకాడు. ఇక ఈ ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో టీమిండియా ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ 5వ ర్యాంకులో, కెప్టెన్ రోహిత్ శర్మ 6, వికెట్ కీప‌ర్ 10వ ర్యాంకులో నిలిచారు. బౌలింగ్ విభాగంలో స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ రెండో ర్యాంకులో, జ‌స్ ప్రీత్ బుమ్రా ప‌దో ర్యాంకులో కొన‌సాగుతున్నారు.
Ravindra Jadeja
icc
all rounder
test cricket
Virat Kohli
Rohit Sharma
Ravichandran Ashwin

More Telugu News