Ukrainian military: ఉక్రెయిన్ మిలిటరీ బ్యాండ్ నోట ‘డోంట్ వర్రీ.. బీ హ్యాపీ’ పాట!

Ukrainian military band plays Do not Worry Be Happy
  • బాబీ మెక్ ఫెర్రిన్ పాట పాడిన సైన్యం    
  • చేతిలో మ్యూజిక్ పరికరాలు
  • వెనుక ఉక్రెయిన్ జాతీయ పతాకం
  • నెట్టింట వైరల్ గా మారిన వీడియో
రష్యా దాడులతో వందలాది మంది ఉక్రెయిన్ పౌరులు, సైన్యం ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితిని చూస్తున్నాం. యుద్ధం మొదలై 14 రోజులు అయినా, ఉక్రెయిన్-రష్యా మధ్య సంధి ఏర్పడడం లేదు. ఉక్రెయిన్ కూడా తాను తగ్గేదేలే అంటోంది. ఉక్రెయిన్ నుంచి 20 లక్షల మందికి పైగా ప్రజలు శరణార్థులుగా సరిహద్దు దేశాలకు తరలిపోయారని అంచనా. వేలాది ఇళ్లు నేలమట్టం అవుతున్నాయి. దీంతో ప్రజలు బంకర్లలో తలదాచుకుంటున్నారు. 

ఈ క్రమంలో ప్రజలలో ధైర్యం నూరిపోసేందుకు ఉక్రెయిన్ మిలటరీ బ్యాండ్ 'భయపడొద్దు.. హ్యాపీగా ఉండండనే' అర్థంతో కూడిన బాబీ మెక్ ఫెర్రిన్ కు చెందిన ‘డోంట్ వర్రీ బీ హ్యాపీ’ అనే గీతాన్ని ఆలపించారు. ఐదుగురు సైనికులు మ్యూజిక్ ఇనుస్ట్రుమెంట్లను వాయిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయింది. సైనికుల వెనుక ఉక్రెయిన్ జాతీయ జెండా కూడా దర్శనమిస్తోంది.  
Ukrainian military
plays
music
Do not Worry Be Happy

More Telugu News