కరీమున్నీసా తనయుడుకే వైసీపీ ఎమ్మెల్సీ టికెట్
- అనారోగ్యంతో కన్నుమూసిన కరీమున్నీసా
- మాట నిలబెట్టుకున్న వైసీపీ అధినేత జగన్
- రుహుల్లాకు బీఫామ్ అందజేత
విజయవాడ నగరానికి చెందిన మైనారిటీ మహిళ కరీమున్నీసాకు ఏ ఒక్కరి అంచనాలకు అందకుండా ఏకంగా ఎమ్మెల్సీ అవకాశం దక్కిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్సీగా ఎన్నికైన నెలల వ్యవధిలోనే ఆమె అనారోగ్యం కారణంగా మృత్యువాత పడ్డారు. ఫలితంగా శోకసంద్రంలో కూరుకుపోయిన ఆమె కుటుంబానికి జగన్ భరోసా ఇచ్చారు.
కరీమున్నీసా స్థానానికి జరిగే ఎన్నికలో ఆమె కుమారుడు ఎండీ రుహుల్లాకు అవకాశం కల్పిస్తానని జగన్ ఇదివరకే హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు బుధవారం నాడు రుహుల్లాకు పార్టీ బీఫామ్ ను జగన్ అందజేశారు. ఈ ఎన్నికలో రుహుల్లా ఈజీగానే విజయం సాధించే అవకాశాలున్నాయి.