YS Jagan: పాలనలో వైఎస్ జగన్ సర్కారుకు మరోసారి నెంబర్ 1 ర్యాంకు: 'స్కాచ్ గ్రూపు గవర్నెన్స్ రిపోర్ట్ కార్డు' 2021 విడుదల

  • పోలీసింగ్, వ్యవసాయం, ఈ గవర్నెన్స్ మెరుగు
  • గ్రామీణాభివృద్ధి, రవాణాలోనూ మెరుగైన పనితీరు
  • రెండో సారి ఏపీకి అత్యుత్తమ ర్యాంకు
  • రెండు, మూడు స్థానాలలో బెంగాల్, ఒడిశా   
YS Jagan government secures rank1 in governance report card in country

పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు దేశంలోనే మరోసారి నెంబర్ 1 ర్యాంకును సొంతం చేసుకుంది. వరుసగా రెండో ఏడాది 2021కి సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం ర్యాంకుల్లో ముందున్నట్టు స్కాచ్ గ్రూపు గవర్నెన్స్ రిపోర్ట్ కార్డు ప్రకటించింది. రెండు పర్యాయాలు నెంబర్ 1 ర్యాంకును ఇంత వరకు వేరే ఏ రాష్ట్రం కూడా సంపాదించుకోలేకపోయింది. 

పోలీసు/భద్రత, వ్యవసాయం, ఈ- గవర్నెన్స్, గ్రామీణాభివృద్ది అంశాలు జగన్ సర్కారును నెంబర్ 1గా నిలబెట్టినట్టు స్కాచ్ గ్రూపు రిపోర్ట్ కార్డు తెలిపింది. జిల్లా పాలనా యంత్రాంగం నిర్వహణ కూడా మెరుగ్గా ఉండడం ఉత్తమ ర్యాంకుకు తోడ్పడింది. రవాణా విషయంలోనూ పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర తర్వాత ఏపీ మూడో స్థానం దక్కించుకుంది. వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న ప్రాజెక్టుల పురోగతి, ఫలితాలను విశ్లేషించిన అనంతరం స్కాచ్ గ్రూపు ఈ ర్యాంకులను కేటాయిస్తుంటుంది.
 
స్కాచ్ గ్రూపు గవర్నెన్స్ రిపోర్ట్ కార్డు 2020లో మూడో స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్ సర్కారు 2021 రిపోర్ట్ లో రెండో స్థానానికి ఎగబాకింది. ఇక ఒడిశా సర్కారు ఎనిమిదో స్థానం నుంచి ఈ విడత మూడో స్థానానికి పుంజుకుంది. ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్, గుజరాత్, మహారాష్ట్రను స్టార్ ఫెర్ ఫార్మర్ గా.. తెలంగాణ, యూపీ, మధ్యప్రదేశ్, అసోం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను పెర్ ఫార్మర్ గా పనితీరు ఆధారంగా స్కాచ్ గ్రూపు వర్గీకరించింది. రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ ఈ వివరాలను తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు.

More Telugu News