PM Modi: మోదీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా

  • సుమీ నుంచి భారత విద్యార్థుల తరలింపు
  • అందులో తొమ్మిది మంది బంగ్లాదేశీయులు
  • ఒక నేపాలీ, ఒక ట్యూనీషియా విద్యార్థికి చోటు
Sheikh Hasina thanks PM Modi for evacuating Bangladeshis from Ukraine under Operation Ganga

తమ దేశ పౌరులను యుద్ధ భూమి ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా తరలించడంలో సాయపడినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి.. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికార వర్గాలు వెల్లడించాయి.
 
ఉక్రెయిన్ లోని సుమీ ప్రాంతంలో చిక్కుకుపోయిన భారతీయులను పోల్తావాకు తరలించే చర్యలను భారత ఎంబసీ అధికారులు మంగళవారం చేపట్టారు. రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించడంతో ఇది సాధ్యపడింది. దీంతో కీవ్, చెర్నిహివ్, సుమీ, ఖార్కివ్, మౌరిపోల్ ప్రాంతాల్లోకి ప్రవేశించే మార్గాలు ఏర్పడ్డాయి. 

సుమీ నుంచి 12 బస్సులతో కూడిన భారత వాహన కాన్వాయ్ పోల్తావాకు బయలుదేరి వెళ్లింది. భారత ఎంబసీ అధికారులకు, ఇండియన్ వరల్డ్ ఫోరమ్, రెడ్ క్రాస్ ప్రతినిధులు సాయంగా నిలిచారు. ఈ కాన్వాయ్ లో భారతీయులతోపాటు బంగ్లాదేశ్ కు చెందిన తొమ్మిది మంది, ఒక నేపాలి, ఒక ట్యూనీషియా విద్యార్థి కూడా ఉన్నారు. పోల్తావా నుంచి వీరిని రైళ్లలో పశ్చిమ ఉక్రెయిన్ సరిహద్దులకు తరలించనున్నారు. అక్కడి నుంచి విమానాల్లో వారిని భారత్ కు తీసుకొస్తారు. బంగ్లాదేశ్ పౌరులకు కూడా సాయం అందించడం పట్ల షేక్ హసీనా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

More Telugu News