Allu Arjun: 'పుష్ప 2'లో నెక్స్ట్ లెవెల్లో డాన్సులు .. ఫైట్లు ఉండాలనేది బన్నీ మాట!

Pushpa 2 movie update
  • సంచలన విజయాన్ని సాధించిన 'పుష్ప'
  • 330 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టిన సినిమా 
  • సీక్వెల్ కోసం జరుగుతున్న సన్నాహాలు 
  • త్వరలోనే రెగ్యులర్ షూటింగు మొదలు 

అల్లు అర్జున్ తన సినిమా కోసం చేసే కసరత్తు మామూలుగా ఉండదనే విషయం తెలిసిందే. లుక్ దగ్గర నుంచి .. టైటిల్ దగ్గర నుంచి ఆయన కేర్ తీసుకుంటాడు. తన ప్రతి సినిమా అంతకు ముందు సినిమా కంటే ఒక మెట్టు పైన ఉండాలనేది ఆయన ఆలోచన. ఆ విధంగానే ఆయన ప్లాన్ చేసుకుంటూ వెళుతున్నాడు. 

ఇటీవల ఆయన నుంచి వచ్చిన 'పుష్ప' సినిమా బాలీవుడ్ లో కూడా 100 కోట్ల వసూళ్లను సాధించింది. మొత్తంగా చూసుకుంటే 330 కోట్లకి పైగా రాబట్టింది. ఈ సినిమాలోని ఫైట్స్ .. బన్నీ సిగ్నేచర్ స్టెప్స్ జనంలోకి ఒక రేంజ్ లో వెళ్లాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీటి దృశ్యాలు విపరీతంగా కనిపించాయి. 

ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ పనులు మొదలైపోయాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగుకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. 'పుష్ప' సినిమాలోకి మించి ఈ సినిమాలో స్టెప్పులు .. ఫైట్లు ఉండాలని సుకుమార్ తో బన్నీ చెప్పాడట. దాంతో యాక్షన్ కొరియోగ్రఫర్లు .. డాన్స్ కొరియోగ్రఫర్లు కొత్తదనం కోసం కసరత్తు మొదలెట్టారని సమాచారం. అంతకుమించి అన్నట్టుగా 'పుష్ప 2 ఉంటుందని బన్నీ ముందుగానే చెప్పాడు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడన్న మాట.

  • Loading...

More Telugu News