Andhra Pradesh: బలహీన పడిన వాయుగుండం.. ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Temperatures increasing in Andhrapradesh
  • వాయుగుండం బలహీన పడడంతో గాలుల్లో తగ్గిన తేమ
  • రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం
  • సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతల నమోదు
  • కర్నూలులో అత్యధికంగా 37.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
ఆంధ్రప్రదేశ్‌లో ఎండ మంట అప్పుడే మొదలైంది. బంగాళాఖాతంలో మూడు రోజుల క్రితం ఏర్పడిన వాయుగుండం బలహీనపడడానికి తోడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఆకాశం నిర్మలంగా ఉండడం, సముద్రం నుంచి వచ్చే గాలులు తగ్గడంతో వాతావరణం పొడిగా మారింది. ఫలితంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. 

వాయుగుండం బలహీన పడడంతో సముద్రం మీదుగా వచ్చే గాలుల్లో తేమశాతం గణనీయంగా తగ్గింది. ఫలితంగా నిన్న కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత బాగా పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. తుని, అమరావతి, కర్నూలులో అత్యధికంగా 37.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండుమూడు రోజుల్లోనూ ఉష్ణోగ్రతలు ఇలానే ఉంటాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
Andhra Pradesh
Temperatures
Rayalaseema
Coastal AP

More Telugu News