Indian Students: సుమీ సిటీ నుంచి విద్యార్థులందరినీ తరలించాం: విదేశాంగ శాఖ

  • ఉక్రెయిన్ పై రష్యా దాడులు తీవ్రతరం
  • సుమీ నగరంలో చిక్కుకుపోయిన భారత విద్యార్థులు
  • పోల్టావా నుంచి రైళ్లలో తరలింపునకు ఏర్పాట్లు
MEA tells all Indian students were evacuated

రష్యా ఉద్ధృతంగా దాడులు చేస్తుండడంతో ఉక్రెయిన్ నుంచి విదేశీయుల తరలింపునకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా, పలు నగరాల్లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులు బయటికి వచ్చే మార్గం లేక అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో, కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంది. రష్యా సేనల దాడులతో వణికిపోతున్న సుమీ నగరం నుంచి భారత విద్యార్థులందరినీ తరలించామని కేంద్ర విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 

వారిని పోల్టావా తరలిస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి వెల్లడించారు. సుమీ నుంచి భారత విద్యార్థులందరినీ తరలిస్తుండడం సంతోషం కలిగిస్తోందని తెలిపారు. విద్యార్థులు పోల్టావా చేరుకుని అక్కడి నుంచి రైళ్ల ద్వారా పశ్చిమ ఉక్రెయిన్ కు వెళతారని వివరించారు. ఆపరేషన్ గంగలో భాగంగా వారిని విమానాల్లో స్వదేశానికి తీసుకువస్తామని బాగ్చి ట్వీట్ చేశారు.

More Telugu News