Akash Piri: విజయ్ దేవరకొండ చేతుల మీదుగా 'చోర్ బజార్' సెకండ్ సింగిల్!

Chor Bazaar movie update
  • మాస్ యాక్షన్ మూవీగా 'చోర్ బజార్'
  • 'జార్జి రెడ్డి' దర్శకుడి మరో సినిమా 
  • ఆకాశ్ పూరి జోడిగా గెహనా సిప్పీ 
  • సంగీత దర్శకుడిగా సురేశ్ బొబ్బిలి
ఆకాశ్ పూరి హీరోగా 'చోర్ బజార్' సినిమా రూపొందింది. వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమాకి జీవన్ రెడ్డి దర్శకత్వం వహించాడు. 'జార్జి రెడ్డి'తో మంచి పేరు తెచ్చుకున్న ఆయన నుంచి వస్తున్న మరో సినిమా ఇది. ఈ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా గెహనా సిప్పీ పరిచయమవుతోంది.

సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి ఇటీవల ఫస్టు సింగిల్ ను వదలగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఇప్పుడు ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకు విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ఈ సాంగ్ ను రిలీజ్ చేయించనున్నారు. 

ఇంతవరకూ ఆకాశ్ పూరి ప్రేమకథా చిత్రాలను ఎక్కువగా చేస్తూ వచ్చాడు. ఇటీవల ఆయన నుంచి వచ్చిన 'రొమాంటిక్' యూత్ కి బాగా కనెక్ట్ అయింది. మాస్ ఆడియన్స్ నుంచి కూడా మంచి మార్కులు కొట్టేయాలనే ఉద్దేశంతో అయన ఈ సినిమా చేశాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Akash Piri
Gehna Sippy
Chor Bazaar Movie

More Telugu News