Anupama Parameshwaran: 'బటర్ ఫ్లై' నుంచి అనుపమ సాంగ్ రిలీజ్!

  • యూత్ లో అనుపమకి క్రేజ్ 
  • థ్రిల్లర్ డ్రామాగా 'బటర్ ఫ్లై'
  • కీలక పాత్రలో భూమిక
  • త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటన
Butterfly movie song released

ఆరంభంలో అనుపమ పరమేశ్వరన్ వరుస విజయాలను అందుకుంటూ వెళ్లింది. ఈ మధ్య కాలంలో ఆమెకు సరైన సినిమా పడలేదనే చెప్పాలి. ఇటీవల వచ్చిన 'రౌడీ బాయ్స్' రిజల్ట్ కూడా ఆమెను నిరాశపరిచింది. ఇక ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'బటర్ ఫ్లై' రెడీ అవుతోంది. ఇది నాయిక ప్రధానమైన సినిమా.


ఈ రోజన 'ఉమెన్స్ డే' సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. సందర్భానికి తగిన పాటనే ఇది. అనుపమ బృందంపై ఈ పాటను చిత్రీకరించారు. థ్రిల్లర్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. ఘంటా సతీశ్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భూమిక ఒక కీలకమైన పాత్రను పోషించింది. 

విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమైనట్టుగా మేకర్స్ చెబుతున్నారు. ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో కథ నడుస్తుందని అంటున్నారు. భూమిక  పాత్ర కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

More Telugu News