Pavan Kalyan: పవన్ సినిమాపై స్పందించిన పూజ హెగ్డే!

Bhavadeeyudu Bhagath Singh movie update
  • విడుదలకి రెడీ అవుతున్న 'రాధేశ్యామ్'
  • త్వరలో మహేశ్ బాబుతో సెట్స్ పైకి 
  • ఆ తరువాత సినిమా పవన్ తోనే 
  • హరీశ్ శంకర్ తో పూజ మూడో సినిమా

ప్రభాస్ జోడీగా పూజ హెగ్డే చేసిన 'రాధే శ్యామ్' ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ తో పూజ హెగ్డే బిజీగా ఉంది. ప్రభాస్ తో పాటు ఆమె కూడా అన్ని ప్రమోషన్స్ కార్యక్రమాలకు హాజరవుతోంది.


తాజా ఇంటర్వ్యూలో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాలో ఆమె ఎంపిక గురించిన ప్రశ్న ఎదురైంది. అందుకు ఆమె నవ్వుతూ "ఆ విషయాన్ని హరీశ్ శంకర్ గారిని అడగండి" అంటూ సమాధానం ఇచ్చింది. అంతే తప్ప తాను ఆ సినిమాను చేయడం లేదని మాత్రం చెప్పలేదు. అందువలన ఆమె ఎంపిక ఖాయమైనట్టేనని అంటున్నారు. 

తన ఎంపిక విషయం హరీశ్ శంకర్ ద్వారా బయటికి రావాలనే ఉద్దేశంతోనే పూజ అలా అందని చెప్పుకుంటున్నారు. 'దువ్వాడ జగన్నాథం' .. 'గద్దలకొండ గణేశ్' సినిమాలతో  ఆయన ఆమెకు హిట్స్ ఇచ్చాడు. పైగా ఇది పవన్ కల్యాణ్ తో సినిమా. అందువలన పూజ కాదనే ఛాన్సే లేదని అంటున్నారు. ఇక త్రివిక్రమ్ - మహేశ్ సినిమాలోనూ ఆమెనే కథానాయిక అనే విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News