Akhil: పాన్ ఇండియా సినిమా దిశగా అఖిల్ అడుగులు!

  • షూటింగు దశలో 'ఏజెంట్'
  • కీలక పాత్రలో మమ్ముట్టి 
  • అఖిల్ పై దృష్టి పెట్టిన కరణ్ జొహార్ 
  • రంగంలోకి బాలీవుడ్ డైరెక్టర్  
Agent movie update

అఖిల్ తన కెరియర్ ను మొదలుపెట్టిన తరువాత 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత సినిమాగా ఆయన 'ఏజెంట్' సినిమా చేస్తున్నాడు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగు దశలో ఉంది. స్పై థ్రిల్లర్ గా సాగే ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. 


ఈ సినిమాతో 'సాక్షి వైద్య' తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఇక ఒక కీలకమైన పాత్రలో మమ్ముట్టి కనిపించనున్నాడు. హిప్ హాప్ తమిళ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఎప్పుడు థియేటర్లకు వదిలేది త్వరలో ప్రకటించనున్నారు. ఈ సినిమా తరువాత అఖిల్ కూడా పాన్ ఇండియా దిశగా అడుగులు వేయనున్నాడని అంటున్నారు.

బాలీవుడ్ లో భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా చెప్పుకునే కరణ్ జొహార్, అఖిల్  హీరోగా ఒక పాన్ ఇండియా సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ఈ సినిమాకి బాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కథాచర్చలు జరుగుతున్నాయట.

More Telugu News