BSNL: రూ.329కే 1000జీబీ డేటా... బీఎస్ఎన్ఎల్ బంపర్ బొనాంజా ప్లాన్

BSNL introduces bumper bonanza plan for fibre users
  • బీఎస్ఎన్ఎల్ ఫైబర్ లో బేసిక్ ప్లాన్
  • నెల రోజుల కాలపరిమితితో ప్లాన్
  • ఎంపిక చేసిన రాష్ట్రాల్లోనే అమలు
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ తన ఫైబర్ వినియోగదారుల కోసం అదిరిపోయే ప్లాన్ ప్రకటించింది. ఈ బంపర్ బొనాంజా ప్లాన్ ప్రకారం... కేవలం రూ.329కే 1000జీబీ డేటా పొందవచ్చు. అదికూడా 20 ఎంబీపీస్ స్పీడ్ తో డేటా వాడుకోవచ్చు. నెల రోజుల్లోపలే 1000జీబీ డేటా అయిపోతే బ్రాడ్ బ్యాండ్ స్పీడ్ తగ్గిపోతుంది. 

ఇది బీఎస్ఎన్ఎల్ ఫైబర్ లో బేసిక్ ప్లాన్. నెల రోజుల కాలపరిమితితో వస్తోంది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు ఏ నెట్వర్క్ కు అయినా లోకల్, ఎస్టీడీ కాల్స్ కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి దీన్ని కొన్ని రాష్ట్రాల్లోనే అమలు చేస్తున్నారు.
BSNL
Fibre
Basic Plan
1000GB
India

More Telugu News