కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్నెల్లలో చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదింపజేస్తాం: రేవంత్ రెడ్డి
- రిజర్వేషన్ బిల్లు కోసం సోనియా ఎంతో ప్రయత్నించారన్న రేవంత్
- అయితే మోదీ అడ్డుకున్నారని ఆరోపించిన టీపీసీసీ చీఫ్
- సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిదన్న రేవంత్
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రయత్నించారని, అయితే మోదీ అడ్డుకున్నారని ఆరోపించారు. మహిళల సర్వతోముఖాభివృద్ధికి కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందని, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ సర్కారుపైనా రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యసనపరుల రాష్ట్రంగా మార్చారని, గల్లీల్లోనూ మద్యం, గంజాయి లభ్యమవుతోందని అన్నారు. మహిళల జీవితాలతో తెలంగాణ సర్కారు చెలగాటమాడుతోందని మండిపడ్డారు.