జగన్ అక్రమాస్తుల కేసు.. రఘురామకృష్ణరాజు పిల్ పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

08-03-2022 Tue 12:38
  • సీబీఐ, ఈడీ పలు అంశాలను విచారించలేదని రఘురాజు పిల్
  • పిల్ పై అభ్యంతరాలను వ్యక్తం చేసిన రిజిస్ట్రీ
  • పిల్ కు నెంబర్ కేటాయించాలన్న ధర్మాసనం
TS HC orders in Raghu Rama Krishna Raju PIL on Jagan dispropotionate assets case
జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిల్ పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. రఘురాజు వేసిన పిల్ పై హైకోర్టు రిజిస్ట్రీ తెలిపిన అభ్యంతరాలను చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. రఘురాజు వేసిన పిల్ కు నంబర్ కేటాయించాలని ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసులో కొన్ని అంశాలను ఈడీ, సీబీఐ విచారించలేదని రఘురాజు ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని వేశారు. అయితే పిల్ పై పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ హైకోర్టు రిజిస్ట్రీ పిల్ ను అనుమతించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా పిల్ కు నెంబర్ కేటాయించాలని ధర్మాసనం ఆదేశించింది.