Ukraine: నేనేమీ దాక్కోలేదు.. ఎవరికీ భయపడేది లేదు.. నేను ఇక్కడ ఉన్నా..: జెలెన్ స్కీ

I am not hiding I am not afraid of anyone Ukraine President Zelenskyy
  • తాను రహస్య ప్రాంతానికి పారిపోలేదన్న జెలెన్ స్కీ  
  • కీవ్ లోని బాంకోవా స్ట్రీట్ లో ఉన్నానని వెల్లడి 
  •  ఇన్ స్టా గ్రామ్ లో లొకేషన్ షేర్ చేసిన వైనం  
  • గెలిచేందుకు ఏదైనా కోల్పోవచ్చన్న అధ్యక్షుడు 
తాను ఎక్కడా దాక్కోలేదని, రహస్య ప్రాంతానికి పారిపోలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. తను ఎక్కడ ఉన్నానో తెలియజేసే లొకేషన్ ను ఇన్ స్టా గ్రామ్ పేజీలో జెలెన్ స్కీ షేర్ చేశారు. ‘‘నేను కీవ్ లోని బాంకోవా స్ట్రీట్ లో ఉన్నాను. నేను దాక్కోలేదు. నేను ఎవరికీ భయపడడం లేదు’’అంటూ పోస్ట్ పెట్టారు

మనం ఈ దేశ భక్తి యుద్ధంలో గెలవడానికి ఏదైనా కోల్పోవచ్చని  వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 24న రష్యా యుద్ధం మొదలు పెట్టిన తర్వాత.. రష్యా దళాలు చేసిన మూడు హత్యా ప్రయత్నాల నుంచి జెలెన్ స్కీ తప్పించుకున్నట్టు కథనాలు వస్తుండడం తెలిసిందే. తనను చివరిగా చూడడం ఇదే కావచ్చంటూ కొన్ని రోజుల క్రితం ఆయన నిర్వేద ప్రకటన చేయడం గమనార్హం. దీంతో జెలెన్ స్కీ రహస్య ప్రాంతానికి వెళ్లిపోయి ఉంటారన్న కథనాలు వస్తున్నాయి. దీనిపై ఆయన స్పందించారు.
Ukraine
Zelenskyy
president
hiding

More Telugu News