Balakrishna: బాలకృష్ణ సెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన విలన్!

  • షూటింగు దశలో బాలకృష్ణ 107వ సినిమా
  • కథానాయికగా శ్రుతి హాసన్ 
  • కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ 
  • ప్రతినాయకుడిగా దునియా విజయ్
Gopichand Malineni movie update

బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. కెరియర్ పరంగా  బాలకృష్ణకి ఇది 107వ సినిమా. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఫస్టు షెడ్యూల్లో రామ్ - లక్ష్మణ్ నేతృత్వంలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. 

ఈ సినిమాలో బాలకృష్ణతో తలపడే విలన్ గా కన్నడ ఆర్టిస్ట్ దునియా విజయ్ నటిస్తున్నాడు. కన్నడలో విలన్ రోల్స్ ద్వారా క్రేజ్ సంపాదించుకున్న దునియా విజయ్, ఆ తరువాత హీరోగా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇతర భాషల్లో విలన్ పాత్రలు చేయడానికి కూడా ఆయన ఉత్సాహాన్ని చూపుతున్నాడు. 

ఈ క్రమంలో బాలకృష్ణ సినిమా కోసం దునియా విజయ్ రంగంలోకి దిగిపోయాడు. ఆయనకు బొకే అందజేసి మరీ గోపీచంద్ మలినేని టీమ్ సెట్స్ లోకి వెల్ కమ్ చెప్పింది. ఇక ఆయన కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ అలరించనుండగా, కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది.

More Telugu News