CM Jagan: రాబోయే రెండేళ్లు కీలకం... ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉండాలి: సీఎం జగన్

CM Jagan held cabinet meeting
  • క్యాబినెట్ సమావేశం నిర్వహించిన సీఎం జగన్
  • ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని వెల్లడి
  • ప్రతి హామీని అమలు చేశామని స్పష్టీకరణ
  • చెప్పనివి కూడా చేశామని వివరణ

ఏపీ క్యాబినెట్ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ, రాబోయే రెండేళ్లు కీలకమని అన్నారు. ఈ రెండేళ్ల పాటు ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో ఉండాలని స్పష్టం చేశారు. త్వరలోనే పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామని, ఎన్నికల ముందు చెప్పని వాగ్దానాలను కూడా నెరవేర్చామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటిని పారదర్శకంగా అందిస్తున్నామని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News