'ఏజెంట్' నుంచి మమ్ముట్టి ఫస్టులుక్!

07-03-2022 Mon 17:15
  • స్పై థ్రిల్లర్ గా 'ఏజెంట్'
  • అఖిల్ జోడీగా సాక్షి వైద్య 
  • సంగీత దర్శకుడిగా హిపాప్ 
  • త్వరలో రిలీజ్ డేట్ ప్రకటన
Agent movie Mamootty look released
అఖిల్ తాజా చిత్రంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' సినిమా రూపొందుతోంది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ కి హిపాప్ సంగీతాన్ని సమకూర్చాడు. వక్కంతం వంశీ యాక్షన్ ప్రధానంగా అల్లిన కథతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. 

ఈ రోజున ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ మొదలైంది. డిఫరెంట్ లుక్ తో అఖిల్ కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన సరసన నాయికగా సాక్షి వైద్య తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఈ కథలో కీలకంగా కనిపించే పవర్ఫుల్ పాత్రను మమ్ముట్టి పోషిస్తున్నారు. కొంతసేపటి క్రితం ఆయన ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు.

ఒక ఆపరేషన్ కోసం యాక్షన్ లోకి దిగిన మమ్ముట్టి స్టిల్ ఆకట్టుకుంటోంది. గతంలో సురేందర్ రెడ్డి - వక్కంతం వంశీ కాంబినేషన్లో మంచి హిట్స్ వచ్చాయి. అలాగే ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.