Ravichandran Ashwin: అశ్విన్.. ఆల్ టైమ్ గ్రేట్!: రోహిత్ శర్మ కితాబు

Aswin is all time great team india captain rohit sharma
  • టెస్ట్ క్రికెట్ లో అతడు సాధించింది పెద్ద రికార్డు
  • ఎప్పటికప్పుడు ఆట తీరుకు మెరుగు పెడుతున్నాడు
  • ఎన్నో మ్యాచ్ లను గెలిపించాడన్న రోహిత్ 
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ను ఎప్పటికీ గొప్ప ఆటగాడిగా అభివర్ణించాడు. శ్రీలంకతో మొదటి టెస్ట్ మ్యాచ్ లో గొప్ప విజయం సాధించడంలో రవీంద్ర జడేజాతోపాటు, అశ్విన్ కీలక పాత్ర పోషించడం తెలిసిందే. మొదటి టెస్ట్ లో అశ్విన్ మొత్తం ఆరు వికెట్లు తీయడంతో.. టెస్టుల్లో మొత్తం 436 వికెట్లతో అనిల్ కుంబ్లే (619 వికెట్లు) తర్వాత రెండో స్థానానికి చేరుకున్నాడు. అప్పటి వరకు రెండో స్థానంలో ఉన్న కపిల్ దేవ్ రికార్డును వెనక్కి నెట్టేశాడు. 

దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ,  అతడి క్రికెట్ కెరీర్ లో దీన్ని పెద్ద రికార్డు సాధనగా పేర్కొన్నాడు. ‘‘అశ్విన్ ను ఎంతో కాలంగా చూస్తున్నాను. ప్రతి సందర్భంలోనూ అతడు తన పనితీరుకు మరింత మెరుగు పెట్టుకుంటున్నాడు. తన కోసం, జట్టు కోసం ఏదైనా సాధించే విషయంలో తన సామర్థ్యాలపై ఎప్పుడూ పూర్తి విశ్వాసం ఉంచే వాళ్లలో అశ్విన్ కూడా ఒకడు. నా దృష్టిలో అశ్విన్ ఆల్ టైమ్ గ్రేట్. ఎన్నో ఏళ్లుగా దేశం కోసం సేవలు అందిస్తున్నాడు. ఎన్నో మ్యాచ్ లను గెలిపించాడు’’ అని రోహిత్ శర్మ వివరించాడు.
Ravichandran Ashwin
test record
rohit sharma

More Telugu News