AP Assembly Session: ఏపీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు

TDP MLAs walk out from Assembly
  • సభ ప్రారంభమైన వెంటనే గందరగోళం
  • గవర్నర్ గో బ్యాక్ అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు
  • బడ్జెట్ ప్రతులను చింపేసిన వైనం

ఏపీ అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే తీవ్ర గందరగోళం నెలకొంది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తుండగా.. గవర్నర్ గోబ్యాక్ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఆయన ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ నినదించారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో బడ్జెట్ ప్రతులను వారు చించేశారు. అనంతరం నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వారు సభ నుంచి వెళ్లిపోయారు. మరోపక్క, గవర్నర్ తిరిగి వెళ్లే దారిలో టీడీపీ సభ్యులు వెళ్లకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. అనంతరం అసెంబ్లీ లాబీలో వారు బైఠాయించారు.

  • Loading...

More Telugu News