నా గుండె బద్దలైంది: షేన్ వార్న్ మాజీ ప్రియురాలు, సినీ నటి ఎలిజబెత్ హర్లీ
- 2011 నుంచి 2013 వరకు సహజీవనం చేసిన వార్న్, హర్లీ
- సూర్యుడు మేఘాల చాటుకు వెళ్లిపోయాడనిపిస్తోందన్న హర్లీ
- షేన్ వార్న్ అత్యున్నతమైన వ్యక్తి అని వ్యాఖ్య
56 ఏళ్ల హర్లీ ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ.. "సూర్యుడు మరెప్పుడూ బయటకు రాకుండా మేఘాల చాటుకు వెళ్లిపోయాడనిపిస్తోంది. నేను ఎంతో ప్రేమించిన వ్యక్తి ఆత్మకు శాంతి కలగాలి. నాకు తెలిసిన వ్యక్తులలో అత్యున్నతమైన వ్యక్తి షేన్ వార్న్. ఆయన మరణంతో నా గుండె బద్దలయింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రేమను పంపుతున్నాను" అంటూ భావోద్వేగానికి గురయింది. ఎలిజబెత్ హర్లీ కుమారుడు డామియన్ కు తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమెకు, వార్న్ దగ్గరయ్యారు. వీరి సంబంధంపై ప్రపంచ మీడియా అప్పట్లో అత్యంత ఆసక్తిని ప్రదర్శించింది.