Russia: ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా బాంబుల వర్షం... నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని జెలెన్ స్కీ మరోసారి విజ్ఞప్తి

  • 11వ రోజు కూడా కొనసాగిన రష్యా దాడులు
  • నానాటికీ దాడుల్లో తీవ్రత పెంచుతున్న పుతిన్
  • ఉక్రెయిన్ కీలక నగరాలు రష్యా వశం
  • కీవ్ ను చేజిక్కించుకునేందుకు భారీగా రష్యా బలగాలు
Russia huge bombing on Ukraine capital Kyiv

ఉక్రెయిన్ పై రష్యా దాడులు నేటికి 11వ రోజుకు చేరుకున్నాయి. నానాటికీ రష్యా సేనల దాడులు ఉద్ధృతమవుతున్నాయి. ఇవాళ కూడా రష్యా సైన్యం మహోగ్రంగా విరుచుకుపడింది. ఇప్పటికే ఉక్రెయిన్ లోని కీలక నగరాలను హస్తగతం చేసుకున్న రష్యా... ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై బాంబుల వర్షం కురిపించింది. మేరియుపోల్, వోల్నోవోఖ్ నగరాలను రష్యా బలగాలు చుట్టుముట్టాయి.

అటు, చెర్నోబిల్, జపోర్జియా అణు విద్యుత్ కేంద్రాలు రష్యా సేనల అధీనంలోకి వెళ్లిపోయాయి. ఇప్పటిదాకా 219 ఉక్రెయిన్ సైనిక స్థావరాలు ధ్వంసం అయ్యాయి. 

కాగా, రష్యా తమ ఎయిర్ పోర్టులపైనా దాడులు చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ ఆరోపించారు. ఒడెస్సాపై రాకెట్ దాడులకు రష్యా సైన్యంగా సిద్ధంగా ఉందని అన్నారు. ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని జెలెన్ స్కీ యూరప్ దేశాల అధినేతలను మరోసారి కోరారు.

More Telugu News