Manipur: మణిపూర్ లో ముగిసిన రెండో విడత పోలింగ్... ఫలితాలపై ఆసక్తి

Second phase elections in Manipur concludes
  • నేడు చివరి దశ పోలింగ్
  • 6 జిల్లాల్లో 22 స్థానాలకు పోలింగ్
  • సాయంత్రం 5 గంటలకు 76 శాతం ఓటింగ్
  • ఈ నెల 10న ఫలితాలు
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా నేడు మణిపూర్ లో చివరిదైన రెండో విడత పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి 76.62 శాతం పోలింగ్ జరిగినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇవాళ రెండో విడతలో 6 జిల్లాల్లో 22 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. 

కొన్నిచోట్ల హింసాత్మక ఘటనలు జరిగినట్టు ఈసీ పేర్కొంది. నాగమజు పోలింగ్ కేంద్రం వద్ద పోలీసు బలగాల కాల్పుల్లో ఇద్దరు మరణించడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దాంతో అక్కడ పోలింగ్ నిలిపివేశారు. కాగా, మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Manipur
Second Phase
Polling
Assembly Elections

More Telugu News