Teacher: విద్యార్థినులకు 'అశ్లీల' బోధన... కీచక ఉపాధ్యాయుడిపై చర్యలు

Teacher suspended in Peddapalli district
  • పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఘటన
  • పరీక్షలో ఏమీ రాయకపోయినా పాస్ చేస్తానన్న టీచర్ 
  • అశ్లీల వీడియోలు చూడాలని విద్యార్థినులకు షరతు
  • పట్టుకుని దేహశుద్ధి చేసిన గ్రామస్థులు 
  • విధుల నుంచి తొలగించిన విద్యాశాఖ

పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినులకు అశ్లీల వీడియోలు చూపించే ప్రయత్నం చేయడం పెద్దపల్లి జిల్లాలో కలకలం రేపింది. ధర్మారం మండలంలోని ఓ ప్రభుత్వ హైస్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సదరు కీచకుడు... 9వ తరగతి విద్యార్థినులపై కన్నేశాడు. తాను చూపించే వీడియోలు చూస్తే, వారు పరీక్షల్లో ఏమీ రాయకపోయినా పాస్ చేస్తానని వారిని ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేశాడు. అంతేకాదు, కొందరు విద్యార్థినులకు పలు అశ్లీల వీడియోలు చూపించాడు. 

ఈ కామాంధుడి వ్యవహారం బయటికి తెలియడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు, ఇతర గ్రామస్థులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అటు, జిల్లా విద్యాశాఖ కూడా స్పందించింది. ఎంఈవో స్కూల్లో విచారణ చేపట్టి ఇతర ఉపాధ్యాయుల నుంచి, విద్యార్థుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అతడు ఉద్దేశపూర్వకంగానే విద్యార్థినులకు అశ్లీల వీడియోలు చూపించాడని గుర్తించిన విద్యాశాఖ... అతడిని విధుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News