Siddhu Jonnalagadda: థియేటర్స్ నుంచి 'డీజే టిల్లు' కొల్లగొట్టిన వసూళ్లు ఇవే!

  • 'డీజే టిల్లు'గా సిద్ధు జొన్నలగడ్డ 
  • కథానాయికగా నేహా శెట్టి 
  • తెలుగు రాష్ట్రాల్లో 13.86 కోట్ల షేర్ 
  • ప్రపంచవ్యాప్తంగా 16.92 కోట్ల షేర్  
DJ Tillu movie update

ఈ మధ్య కాలంలో యూత్ ను ఎక్కువగా ఆకట్టుకున్న సినిమాల్లో 'డీజే టిల్లు' ఒకటిగా కనిపిస్తుంది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు. సిద్ధు జొన్నలగడ్డ - నేహా శెట్టి జంటగా నటించిన ఈ సినిమా, పోస్టర్స్ నుంచే యూత్ లో ఆసక్తిని పెంచడం మొదలుపెట్టింది. 

ఇక ఈ సినిమా టీజర్ .. ట్రైలర్ ఎప్పుడైతే బయటికి వచ్చాయో అప్పటి నుంచి అంచనాలు పెరగడం మొదలైంది. సితార బ్యానర్ కి మంచి పేరు ఉంది. కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే ఈ బ్యానర్ నుంచి వస్తాయనే నమ్మకం ఉంది. అందువలన సహజంగానే ఈ సినిమాపైకి అందరి దృష్టి వెళ్లింది. 

విడుదలైన తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాల జాబితాలో ఇది ఒకటిగా నిలిచింది. రీసెంట్ గా ఈ సినిమా 'ఆహా'లో స్ట్రీమింగ్ అయింది .. మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంటోంది. ఇక థియేట్రికల్ క్లోజింగ్ వసూళ్ల పరంగా చూసుకుంటే, ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 7.11 కోట్లను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 13.86 కోట్ల షేర్ ను రాబట్టిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 16.92 కోట్ల షేర్ ను రాబట్టింది.

More Telugu News