Hyderabad: హైదరాబాద్ లో రేపు ఉదయం ట్రాఫిక్ ఆంక్షలు

Traffic restrictions in Hyderabad tomorrow
  • షీటీమ్స్ ఆధ్వర్యంలో రేపు 5కే, 2కే రన్
  • నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు
  • ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఆంక్షలు

హైదరాబాద్ లో రేపు షీటీమ్స్ ఆధ్వర్యంలో 5కే, 2కే రన్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. రన్ జరగనున్న పీపుల్స్ ప్లాజా, లేపాక్షి, ట్యాంక్ బండ్, పీవీఎన్ఆర్ మార్గ్ ప్రాంతాల్లో ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. 

నెక్లెస్ రోడ్డు రోటరీ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్లే వాహనాలను షాదాన్ కాలేజ్, నిరంకారీ భవన్ మీదుగా మళ్లిస్తారు. లిబర్టీ నుంచి వచ్చే వాహనాలను అంబేద్కర్ విగ్రహం వద్ద మళ్లించి తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీదుగా మళ్లిస్తారు. ఇక్బార్ మీనార్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా మళ్లిస్తారు.

ఇక సంజీవయ్య పార్కు నుంచి వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ నుంచి రాణిగంజ్ క్రాస్ రోడ్డు మీదుగా అనుమతిస్తారు. రన్ కోసం వచ్చే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ప్రసాద్ ఐమ్యాక్స్ ఎదురుగా, ఎంఎంటీఎస్ నెక్లెస్ రోడ్ స్టేషన్, లేక్ పోలీస్ స్టేషన్ పక్కన, ఎంఎస్ మక్తా, డాక్టర్ కార్ పార్కింగ్ వద్ద పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News