Dharmana Prasad: సీఎం జగన్ కు మాజీ మంత్రి ధర్మాన లేఖ

Former minister Dharmana wrote CM Jagan
  • శాసనసభ విధులు, బాధ్యతలపై ప్రస్తావన
  • వివిధ వ్యవస్థల అధికారాలపై అసెంబ్లీలో చర్చించాలని సూచన
  • ఇది హక్కు, బాధ్యత అని స్పష్టీకరణ
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సీఎం జగన్ కు లేఖ రాశారు. న్యాయవ్యవస్థ, శాసనసభ, కార్యనిర్వాహక వ్యవస్థ అధికారాలు, విధులపై అసెంబ్లీలో చర్చించాలని కోరారు. శాసనాలు తయారుచేయడం, విధివిధానాలు, చట్టాలు రూపొందించడం అనే అంశాలు శాసనసభ హక్కు, బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ హక్కును వినియోగించుకోకపోతే అసెంబ్లీ తన బాధ్యతను విస్మరించినట్టేనని ధర్మాన పేర్కొన్నారు. ఇటువంటి హక్కును, బాధ్యతను న్యాయస్థానం కాదనడం రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమని తన లేఖలో ఆయన పేర్కొన్నారు.
Dharmana Prasad
CM Jagan
Letter
YSRCP
Andhra Pradesh

More Telugu News