'యశోద' నుంచి వరలక్ష్మి శరత్ కుమార్ స్పెషల్ పోస్టర్!

05-03-2022 Sat 10:50
  • వరలక్ష్మి శరత్ కుమార్ కి మంచి క్రేజ్ 
  • 'క్రాక్' సినిమాలో విలనిజానికి మంచి మార్కులు 
  • 'యశోద'లో ముఖ్యమైన రోల్ 
  • సెట్స్ పై ఉన్న రెండు సినిమాలు
Yashoda Movie Varalakshmi Sharath Kumar Poster Released
వరలక్ష్మి శరత్ కుమార్ .. తెలుగు .. తమిళ సినీ ప్రేక్షకులకు పరిచయమే అవసరం లేని పేరు. ఈ రెండు భాషల్లో లేడీ విలనిజం చూపించాలనే దర్శక నిర్మాతలకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు ఇదే. తమిళంలో ఒక స్టార్ హీరోయిన్ కు ఉండవలసిన క్రేజ్ .. డిమాండ్ ఆమెకి ఉన్నాయి. ఇక తెలుగులోను ఆ స్థానాన్ని ఆమె అందుకున్నట్టుగానే కనిపిస్తోంది. 

ఇటీవల కాలంలో వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో వరుస సినిమాలను చేస్తూ వెళుతోంది. 'క్రాక్' హిట్ దగ్గర నుంచి ఆమె జోరు మరింత పెరిగినట్టుగా కనిపిస్తోంది. సమంత ప్రధాన పాత్రను పోషిస్తున్న 'యశోద' సినిమాలో వరలక్ష్మి ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఈ రోజున ఆమె పుట్టినరోజు కావడంతో ఈ సినిమా టీమ్ విషెస్ చెబుతూ ఆమె స్పెషల్ పోస్టర్ ఒకటి వదిలారు. 

ఈ సినిమాలో ఆమె 'మధుబాల' అనే పాత్రలో కనిపించనుందనే విషయాన్ని చెప్పారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి హరి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్ 'హనుమాన్' .. బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబోలోను చేస్తున్న సంగతి తెలిసిందే.