ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

four died in a road accident in mulugu district
  • ఎర్రిగట్టమ్మ గుట్ట వద్ద ప్రమాదం
  • ఆటోను ఢీకొన్న డీసీఎం
  • మరో నలుగురికి తీవ్ర గాయాలు
ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వ్యాన్ ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని ఎర్రిగట్టమ్మ వద్ద ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. 

బాధితులను మంగపేట మండలం కోమటిపల్లి వాసులుగా గుర్తించారు. వీరంతా ఆటోలో అన్నారం షరీఫ్ దర్గాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులను అజయ్ (12), కిరణ్ (16), కౌసల్య (60), ఆటో డ్రైవర్ (23)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Mulugu
Road Accident
Warangal
Mangapeta

More Telugu News