Cheenai: చెన్నై మేయర్‌గా దళిత యువతి.. అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు

Priya creates record as youngest mayor to GVC
  • 350 ఏళ్ల చెన్నై కార్పొరేషన్ చరిత్రలో తొలి దళిత మేయర్‌గా ప్రియ
  • 28 ఏళ్ల వయసులోనే మేయర్‌గా రికార్డు
  • తమిళనాడులోని మొత్తం 21 కార్పొరేషన్లలో 11 చోట్ల మహిళా మేయర్లే
గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) మేయర్‌గా ఎన్నికైన దళిత మహిళ ప్రియ నిన్న ప్రమాణ స్వీకారం చేస్తూనే రికార్డులకెక్కారు. 350 ఏళ్ల చెన్నై కార్పొరేషన్ చరిత్రలో దళిత మహిళకు తొలిసారి మేయర్ పీఠం దక్కగా, 28 ఏళ్ల అతి పిన్న ప్రాయంలోనే ప్రియ ఆ బాధ్యతలు స్వీకరించి రికార్డులకెక్కారు.

ప్రియ భర్త రాజా ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 21 కార్పొరేషన్లలో 11 చోట్ల మహిళలే మేయర్లు కావడం మరో విశేషం. కాగా, మొత్తం 200 మంది కార్పొరేటర్లలో డీఎంకేకు చెందిన 153 మంది, ఆది ద్రావిడ (ఎస్‌సీ) వర్గానికి చెందిన ప్రియను మేయర్‌గా ఎన్నుకున్నారు.
Cheenai
Mayor
DMK
SC
GVC
Priya

More Telugu News