Vijay Sai Reddy: కొత్త బాధ్య‌త‌ల్లోకి విజయసాయిరెడ్డి.. అనుబంధ విభాగాల‌తో భేటీ

vijay sai reddy meeting with ysrcp wings
  • పార్టీ అనుబంధ విభాగాల అధ్య‌క్షుల‌తో సాయిరెడ్డి భేటీ
  • ఇటీవ‌లే అనుబంధ విభాగాల ఇన్‌చార్జీగా నియామ‌కం
  • పార్టీకి కార్య‌క‌ర్త‌లే బ‌ల‌మైన పునాది అని వ్యాఖ్య‌

ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైఎస్సార్సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఆ పార్టీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి శుక్ర‌వారం నాడు మ‌రో కొత్త బాధ్య‌త‌ల్లోకి దిగిపోయారు. ఇప్ప‌టికే పార్టీ ఉత్త‌రాంధ్ర వ్య‌వ‌హారాల‌ను చూసుకుంటున్న సాయిరెడ్డిని ఇటీవ‌లే పార్టీ అన్ని అనుబంధ విభాగాల‌కు ఇన్‌చార్జీగా పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించిన బాధ్యతలను నేడు ఆయన స్వీకరించారు.

వైసీపీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జీ హోదాలో సాయిరెడ్డి శుక్ర‌వారం నాడు తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ అన్ని అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్య‌క్షుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా కార్య‌క‌ర్త‌లే వైసీపీకి బ‌ల‌మైన పునాది అని ఆయ‌న పేర్కొన్నారు. పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పాల‌న‌తో పార్టీకి ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ బాగా పెరిగింద‌ని, జ‌గ‌న్ పాల‌న కార‌ణంగా పార్టీ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో విశ్వాసం పెరిగింద‌ని ఆయ‌న అన్నారు. అందుకు ప్ర‌తిఫ‌లంగానే జ‌రిగిన ప్ర‌తి ఎన్నిక‌లోనూ పార్టీకి ప్ర‌జ‌లు అఖండ విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టార‌ని సాయిరెడ్డి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News