పోలవరం ఖర్చంతా కేంద్రానిదే!: కేంద్ర మంత్రి షెకావత్ ప్రకటన
- పోలవరం ఏపీకి జీవనాడి
- ప్రాజెక్టు నిర్మాణం ఖర్చంతా కేంద్రానిదే
- సవరించిన అంచనాలను ఏపీ ఇవ్వట్లేదు
- అంచనాలు అందాక ఆమోదిస్తామన్న కేంద్ర మంత్రి
రెండు రోజుల ఏపీ పర్యటనకు వచ్చిన షెకావత్ శుక్రవారం ఉదయం జగన్‌తో కలిసి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులతో పాటు నిర్వాసిత కాలనీలను కూడా ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా షెకావత్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, సవాళ్లను పరిశీలించానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఒక్కొక్క రాయికి అయ్యే ఖర్చును చెప్పిన ప్రకారమే కేంద్రం భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అని తెలిపారు. ప్రాజెక్టుకు సవరించిన అంచనాల విషయంలో రాష్ట్రం ఇవ్వాల్సిన వివరాలు ఇవ్వటం లేదని.. వివరాలు ఇచ్చిన తర్వాత నిధులను ఆమోదించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.