Russia: ఉక్రెయిన్ నుంచి భారతీయుల సహా విదేశీయులను తరలించేందుకు 130 బస్సులు ఏర్పాటు చేసిన రష్యా

  • ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు
  • పలు నగరాల్లో కర్ఫ్యూ వాతావరణం
  • తిండి లేక అలమటిస్తున్న విదేశీయులు
  • వారిని రష్యాలోని బెల్గోరోడో నగరానికి తరలించాలని నిర్ణయం
Russia takes measures to evacuate foreign nationals including Indian students from Ukraine

ఉక్రెయిన్ లో నానాటికీ రష్యా దాడులు తీవ్రమవుతున్నాయి. రాజధాని కీవ్ సహా ప్రధాన నగరాలను చేజిక్కించుకునే క్రమంలో రష్యా దళాలు భారీ ఎత్తున క్షిపణి దాడులు చేస్తుండడంతో, జనావాసాలపైనా ప్రభావం కనిపిస్తోంది. రష్యా దాడుల భయంతో ఉక్రెయిన్ ప్రజలు లక్షలాదిగా దేశం విడిచి వెళ్లిపోతుండగా, భారతీయుల సహా అక్కడున్న విదేశీయులు స్వదేశాలకు చేరుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. 

ఈ నేపథ్యంలో, రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయుల సహా విదేశీయులను ఉక్రెయిన్ నుంచి వెలుపలికి తరలించేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో తరలింపు చర్యల కోసం 130 బస్సులు ఏర్పాటు చేసింది. ఉక్రెయిన్ లోని ఖర్కీవ్, సుమీ నగరాల నుంచి విదేశీయులను రష్యాలోని బెల్గోరోడో ప్రాంతానికి బస్సుల ద్వారా తరలించనున్నారు. అక్కడి నుంచి విదేశీయులు తమ దేశాలకు వెళ్లవచ్చు. 

కాగా, భారత్ ఇప్పటివరకు ఉక్రెయిన్ పొరుగుదేశాలైన రొమేనియా, హంగేరీల మీదుగా విద్యార్థులను తరలిస్తూ వస్తోంది. ఇంకా ఉక్రెయిన్ లో చాలామంది భారత విద్యార్థులు చిక్కుకుపోయినట్టు భావిస్తున్నారు. ఇప్పుడు రష్యా నిర్ణయంతో వారందరూ క్షేమంగా ఉక్రెయిన్ దాటే అవకాశముంది.

  • Loading...

More Telugu News