Ukraine: మాకు చిక్కిన రష్యన్ సైనికులను వారి తల్లులకు అప్పగిస్తాం: ఉక్రెయిన్

will handover russian soldiers to their mothers says Ukraine
  • తల్లులు వస్తే వారి పిల్లలను అప్పగిస్తాం
  • తమది పుతిన్ మాదిరి ఫాసిస్టు ఆలోచనాధోరణి కాదు
  • తల్లులు, వారి బిడ్డలపై మేము యుద్ధం చేయం
ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యా చేస్తున్న దాడులతో ఉక్రెయిన్ లోని ఎన్నో బిల్డింగులు ధ్వంసమవుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ సైన్యం కూడా రష్యా బలగాలను దీటుగా ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో రష్యా సైనికులు ఉక్రెయిన్ బలగాలకు బందీలుగా చిక్కుతున్నారు. 

మరోవైపు తమకు పట్టుబడిన రష్యన్ సైనికులను వారి తల్లులకు అప్పగించేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ కు వచ్చి మీ పిల్లలను తీసుకెళ్లాలని తెలిపింది. తల్లులు వస్తే వారి పిల్లలను అప్పగిస్తామని చెప్పింది. తాము ఉక్రెయిన్ పౌరులమని... తమది పుతిన్ లా ఫాసిస్టు ఆలోచనాధోరణి కాదని తెలిపింది. తల్లులు, వారి బిడ్డలపై తాము యుద్ధం చేయమని చెప్పింది.
Ukraine
Russia
War
Soldiers

More Telugu News