Korumatla Sreenivasulu: అసెంబ్లీని హైకోర్టు శాసించడం అభ్యంతరకరం.. వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారు: వైసీపీ ఎమ్మెల్యే కోరుముట్ల

Chandrababu managing systems says YSRCP MLA Korumautla
  • న్యాయ వ్యవస్థ తీరు అభ్యంతరకరంగా ఉంది
  • రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పే హక్కు న్యాయ వ్యవస్థకు లేదు
  • ఇలాంటి నిర్ణయాలు తిరిగి న్యాయ వ్యవస్థను కాటేస్తాయి
రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వైసీపీ రైల్వేకోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థ తీరు చాలా అభ్యంతరకరంగా ఉందని అన్నారు. రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పే హక్కు న్యాయ వ్యవస్థకు లేదని చెప్పారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ నిర్ణయమని అన్నారు. 

అసెంబ్లీని న్యాయ వ్యవస్థ శాసించడం దారుణమని... ఇలాంటి నిర్ణయాలు తిరిగి న్యాయ వ్యవస్థనే కాటేస్తాయని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని కోరుముట్ల విమర్శించారు. కోట్లాది మంది ఆశీస్సులతో ప్రభుత్వం ఏర్పడిందని... ప్రజల అవసరాలకు తగ్గట్టుగానే పాలన ఉంటుందని చెప్పారు. పాలనను దెబ్బతీసే విధంగా కొన్ని దుష్ట శక్తులు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. 
Korumatla Sreenivasulu
YSRCP
AP High Court
Chandrababu
Telugudesam

More Telugu News