camera lens: స్మార్ట్ ఫోన్ కెమెరాల్లో లెన్స్.. వాటి వినియోగం ఎలానో తెలుసా?

  • అన్ని ఫోన్లలోనూ వైడ్ యాంగిల్ లెన్స్
  • ఇది ప్రాథమికంగా పనిచేసే లెన్స్
  • ఎక్కువ విస్తీర్ణాన్ని కవర్ చేయాలంటే వైడ్ యాంగిల్ లెన్స్
  • దూరంగా ఉన్న వాటికి టెలిఫొటో లెన్స్
most common camera lens in your smart phones and how to use

స్మార్ట్ ఫోన్లతోపాటు.. వాటిల్లోని కెమెరాల పట్ల ఆదరణ పెరుగుతోంది. ఎన్నో మధుర జ్ఞాపకాలు ఫొటోల రూపంలో ఫోన్లలోకి చేరుతున్నాయి. ఆదరణ, వినియోగం పెరుగుతుండడంతో ఫోన్ల తయారీ కంపెనీలు కూడా కెమెరాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అత్యాధునిక కెమెరా లెన్స్, టెక్నాలజీలను పరిచయం చేస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం స్మార్ట్ ఫోన్లలో ఒకటే లెన్స్ ఉండేది. కానీ, నేడు చాలా దర్శనమిస్తున్నాయి. వీటిల్లో ముఖ్యమైన వాటిని చూస్తే..


వైడ్ యాంగిల్ లెన్స్
స్మార్ట్ ఫోన్లలో ఉండే ప్రైమరీ లెన్స్ ఇది. అన్ని రకాల ఫోన్లలో తప్పకుండా ఉంటుంది. ఫోన్లో కెమెరా ఆన్ చేసిన వెంటనే వైడ్ యాంగిల్ లెన్స్ తెరుచుకుంటుంది. సాధారణ ఫొటోగ్రఫీకి ఈ లెన్స్ చక్కగా ఉపయోగపడుతుంది. యూజర్ల ఎంపికతో సంబంధం లేకుండా కెమెరా ఆప్షన్ ఎంపిక చేసుకుంటే పనిచేసే ప్రాథమిక లెన్స్ గా దీన్ని అర్థం చేసుకోవాలి.

అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్
ఇప్పుడు కనిపించే స్మార్ట్ ఫోన్లలో కనీసం రెండు నుంచి నాలుగు లెన్స్ లు ఉంటున్నాయి. వాటిల్లో అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఒకటిగా చెప్పుకోవాలి. ఫొటో కోసం ఎంపిక చేసుకున్న ప్రదేశం లేదా వ్యక్తుల సమూహం వైపు ఎక్కువ ప్రాంతాన్ని కవర్ చేసేందుకు ఈ లెన్స్ అవసరమవుతుంది. 117 నుంచి 123 డిగ్రీల కోణంలో ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది. ముందు చెప్పుకున్న వైడ్ యాంగిల్ లెన్స్ 79-80 డిగ్రీల పరిధిలోనే ఫొటోలను క్యాప్చర్ చేసుకోగలరు. అంతకుమించిన ప్రాంతాన్ని కవర్ చేసుకునేందుకు అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉపయోగపడుతుంది.

టెలిఫొటో లెన్స్
దూరంగా ఉన్న వాటిని క్యాప్చర్ చేసేందుకు టెలిఫొటో లెన్స్ అవసరపడుతుంది. జూమ్ లెన్స్ అన్నవి ప్రాథమికమైనది. టెలిఫొటో కొంచెం ఖరీదైన లెన్స్. ప్రొఫెషనల్స్ కు టెలిఫొటో లెన్స్ బాగా వినియోగమవుతాయి. దూరంగా ఉన్న వాటిని మరింత స్పష్టంగా క్యాప్చర్ చేసుకోవచ్చు. ప్రీమియం ఫోన్లలోనే ఇవి కనిపిస్తుంది. ఫొటో స్పష్టత కోసం టెలిఫొటో సెన్సార్ ను కూడా కంపెనీలు ఏర్పాటు చేస్తుంటాయి. 

మ్యాక్రోలెన్స్
సబ్జెక్ట్ ను చాలా దగ్గరి నుంచి ఈ లెన్స్ క్యాప్చర్ చేస్తుంది. ఎంత దగ్గరగా అంటే 2 సెంటీమీటర్ల సమీపం నుంచి సబ్జెక్ట్ ను కెమెరాలో బంధించొచ్చు. కెమెరా మెనూ నుంచి ఈ లెన్స్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది కూడా ప్రీమియం ఫోన్లలోనే కనిపిస్తుంటుంది.

More Telugu News