Hyderabad: పెండింగ్ చలానాల మేళా.. డబ్బులే డబ్బులు!

  • మార్చి 1 నుంచి పెండింగ్ చలానాలపై రాయితీలు
  • రాయితీలు కట్టేందుకు పెద్ద ఎత్తున ముందుకొస్తున్న వాహనదారులు
  • మూడు రోజుల్లో ఏకంగా రూ. 39 కోట్ల వసూలు
Rs 39 Crores in 3 days as pending challans

తెలంగాణలో పెండింగ్ చలానాల చెల్లింపు జాతర కొనసాగుతోంది. పేరుకుపోయిన పెండింగ్ చలానాలను రాబట్టుకునేందుకు ప్రకటించిన రాయితీలు వాహనదారులను విశేషంగా ఆకర్షించాయి. దీంతో వెంటనే వాటిని కట్టేసి చేతులు దులుపుకోవాలని భావిస్తున్నారు. 

ఇక జరిమానాలు కట్టేందుకు తొలి రోజు ఎగబడడంతో వెబ్‌సైట్ ఏకంగా క్రాష్ అయింది. ఈ మూడు రోజుల్లో మొత్తంగా 39 కోట్లు వసూలైనట్టు అధికారులు తెలిపారు. సెకనుకు గరిష్ఠంగా 45 వేల హిట్లు వచ్చాయి. నిమిషానికి 700 చలానాల చెల్లింపులు జరుగుతుండడంతో దాని సామర్థ్యాన్ని 1000కి పెంచాలని నిర్ణయించారు. 

మార్చి 1న 8 లక్షలమంది చలానాలు చెల్లించగా, 2వ తేదీన ఏకంగా 15 లక్షల చలానాలు, 3న 16 లక్షల చలానాలను వాహనదారులు చెల్లించారు. పెండింగ్ చలానాల రాయితీ ఈ నెలాఖరు వరకు మాత్రమే ఉండడంతో ఏప్రిల్ 1 నుంచి మళ్లీ పాత పద్ధతిలోనే జరిమానాలు ఉంటాయని సంయుక్త కమిషనర్ (ట్రాఫిక్) ఏవీ రంగనాథ్ ఇప్పటికే ప్రకటించారు. 

ఈ నేపథ్యంలోనే వాహనదారులు పెండింగ్ చలానాలను కట్టేందుకు భారీగా ముందుకొస్తున్నారు. రాయితీలు మళ్లీ ఉంటాయని భావించొద్దని, ఈసారి పట్టుబడితే జరిమానాలు మామూలుగా ఉండవని రంగనాథ్ హెచ్చరించారు.

More Telugu News