Kamal Haasan: 'విక్రమ్' రిలీజ్ డేట్ ఆ రోజున చెబుతారట!

  • యాక్షన్ థ్రిల్లర్ గా 'విక్రమ్'
  • సీక్రెట్ ఏజెంట్ గా కమల్ 
  • సంగీత దర్శకుడిగా అనిరుధ్ 
  • త్వరలో రిలీజ్ డేట్ ప్రకటన
Vikram movie update

కమలహాసన్ కథానాయకుడిగా 'విక్రమ్' సినిమా రూపొందింది. కమల్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కమల్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నారు. అయితే ఆయన పాత్రను మలిచిన తీరు భిన్నంగా ఉంటుందని అంటున్నారు.

ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అంతా ఆసక్తిని .. ఆత్రుతను కనబరుస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయనున్నారనే ప్రకటనను, ఈ నెల 14వ తేదీన ఉదయం 7 గంటలకు చేస్తారట. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారనే విషయం తెలిసిందే. 

డిఫరెంట్ లుక్ తో కమల్ కనిపించనున్న ఈ సినిమాలో, విజయ్ సేతుపతి .. ఫాహద్ ఫాజిల్ .. నరేన్ కీలకమైన పాత్రలను పోషించారు. ఈ మూడు పాత్రలు కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ కి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూర్చాడు.

More Telugu News