Jagan: హైకోర్టు తీర్పుపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం జగన్

Jagan holds meeting after HC verdict on Amaravati
  • రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలన్న హైకోర్టు
  • న్యాయ నిపుణులు, ఉన్నతాధికారులతో జగన్ సమీక్ష
  • సమావేశంలో పాల్గొననున్న బొత్స
రాజధాని అమరావతి విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చిన సంగతి తెలిసిందే. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని తన తీర్పులో స్పష్టం చేసింది. అంతేకాదు రాజధాని అంశంలో చట్టాలు చేసే హక్కు అసెంబ్లీకి లేదని తెలిపింది. హైకోర్టు తీర్పుపై బొత్స, మోదుగుల తదితరులు అసహనం వ్యక్తం చేశారు. 

మరోవైపు హైకోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించబోతున్నారు. హైకోర్టు తీర్పుపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై నిపుణులు, ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఈ సమీక్షలో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పాల్గొననున్నారు. ఇప్పటికే ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. సమీక్ష అనంతరం ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన మీడియాకు వివరించే అవకాశం ఉంది.
Jagan
YSRCP
Botsa
AP High Court
Amaravati

More Telugu News