DK Aruna: శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్ర వెనక పీకే ఉన్నాడు.. కేసీఆర్ నీక్కూడా పిల్లలున్నారు: డీకే అరుణ

Prashant Kishor is behind Srinivas Goud murder conspiracy says DK Aruna
  • శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర అనేది ఒక బోగస్
  • ఆయనను చంపాల్సిన అవసరం ఎవరికీ లేదు
  • దమ్ముంటే నాపై రాజకీయంగా పోరాడండి అంటూ అరుణ సవాల్ 
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగిందనే వార్త రాష్ట్రంలో సంచలనాన్ని రేకెత్తించింది. ఈ వ్యవహారంలో బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, డీకే అరుణల పాత్రపై విచారణ జరుపుతామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రెస్ మీట్ లో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీకే అరుణ మాట్లాడుతూ, శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర అనేది ఒక బోగస్ అని అన్నారు. ఆయనను చంపాల్సిన అవసరం ఎవరికీ లేదని చెప్పారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని అన్నారు. 

శ్రీనివాస్ గౌడ్ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి తాపత్రయపడుతున్నారని అరుణ అన్నారు. ఆయన అవినీతిపై పోరాడుతున్న వారందరికీ తాము షెల్టర్ ఇస్తామని చెప్పారు. శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర వెనుక ప్రశాంత్ కిశోర్ కుట్ర ఉందని ఆరోపించారు. రాత్రిపూట ఇంటిపై రాళ్లు వేయడం కాదని... దమ్ముంటే తనపై రాజకీయంగా పోరాడాలని సవాల్ చేశారు. కేసీఆర్ గారు మీక్కూడా పిల్లలు ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మండిపడ్డారు. పీకే ఇది బెంగాల్ కాదు.. నీ కుట్రలు తెలంగాణలో పని చేయవని చెప్పారు. ఇంతకాలం పులిలా ఉన్న స్టీఫెన్ రవీంద్ర ఇప్పుడు పిల్లిలా మారడం బాధాకరమని అన్నారు.
DK Aruna
BJP
V Srinivas Goud
Murder Plan
KCR
TRS
Prashant Kishor

More Telugu News