Damodar Gautam Sawang: వివేకా హత్యకేసు విషయంలో జగన్ నాకు ఎప్పుడూ ఇదే చెప్పేవారు: మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్

AP Ex DGP Gautam Sawang Responds about viveka murder Case
  • వార్తాపత్రికల్లో తనపై వస్తున్న కథనాలపై స్పందన
  • దోషులకు శిక్ష పడాలనే జగన్ చెప్పేవారు
  • కేసును నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని చెప్పారు
  • వివేకా, అవినాశ్‌రెడ్డి కుటుంబాలు తనకు రెండు కళ్లులాంటివన్నారు
  • అవినాశ్‌రెడ్డి నన్ను ఎప్పుడూ కలవలేదు
ఏపీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు విషయంలో సీఎం వైఎస్ జగన్‌పై వస్తున్న ఆరోపణలపై మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. వివేకా కేసు విషయంలో జగన్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని అన్నారు. డీజీపీగా ఉన్నప్పుడు తాను వ్యాఖ్యానించినట్టుగా పేర్కొంటూ వార్తా పత్రికల్లో వస్తున్న కథనాలపై సవాంగ్ స్పందించారు. వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందన్న ఉద్దేశంతోనే స్పందిస్తున్నట్టు పేర్కొన్నారు. 

వివేకా హత్య కేసులో జగన్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, పైపెచ్చు కేసును నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని, దోషులకు శిక్ష పడేలా చూడాలనే తనతో చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. వివేకానందరెడ్డి, అవినాశ్‌రెడ్డి కుటుంబాలు తనకు రెండు కళ్లు లాంటివని మాత్రమే జగన్ చెప్పారని అన్నారు. సెప్టెంబరు 2019లో వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి తనను కలిసినప్పుడు ఇదే విషయాన్ని వారికి చెప్పానని అన్నారు. తాను డీజీపీగా ఉండగా అవినాశ్‌రెడ్డి కానీ, ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి కానీ, డి.శివశంకర్‌రెడ్డి కానీ ఏనాడు తనను కలవలేదని సవాంగ్ స్పష్టం చేశారు.
Damodar Gautam Sawang
Andhra Pradesh
YS Vivekananda Reddy
YS Jagan
Murder Case

More Telugu News